హరీష్ సంచనల కామెంట్స్ : ప్రభాస్ తర్వాత వరుణ్ తేజ్ నే !
‘గద్దలకొండ గణేష్’ హిట్ కిక్కులో ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తర్వాత ఆలిండియా లెవెల్లో స్టార్ అయ్యే లక్షణాలు వరుణ్ తేజ్ లోనే ఉన్నాయని, అతడితో కేజీఎఫ్ లాంటి సినిమా తీయొచ్చన్నారు. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఉన్నప్పటికీ.. పాన్-ఇండియా స్టార్ అవ్వగలిగే క్వాలిటీస్ మాత్రం వరుణ్ తేజ్ కే ఉన్నాయనడం కాస్త వివాదాస్పదమైంది. అంతేకాదు.. భారీ బడ్జెట్ ఉంటే పాన్-ఇండియా సినిమా అయిపోదంటూ సాహోపై పరోక్షంగా సెటైర్లు వేశాడు.
డీజే-దువ్వాడ జగన్నాథమ్ తర్వాత హరీష్ శంకర్ దాగుడుమూతలు కథని రాసుకొన్నాడు. దాన్ని మల్టీస్టారర్ గా తీసుకొద్దామనుకొన్నాడు. దిల్ రాజు బ్యానర్ లో రావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. దిల్ రాజుకి కథ నచ్చకే సినిమా క్యాన్సిల్ అయినట్టు సమాచారమ్. దీంతో తమిళ్ హిట్ జిగర్తాండని వరుణ్ తేజ్ తో రిమేక్ చేశాడు. హరీష్ చాలా కసితో చేసిన సినిమా ఇది. ఆయన కష్టం ఫలించి గద్దలకొండ గణేష్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొంది. హరీశ్ కి గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ ని తీసుకొచ్చింది. ఇప్పుడీ సినిమా హిట్ కిక్కులో ఉన్న హరీష్ మాటలు కోటలు దాటుతుండటం, వరుణ్ తేజ్ ని లేపే క్రమంలో స్టార్ హీరోలని తక్కువ చేసి మాట్లాడతం ఆయా హీరోల అభిమానులకి నచ్చడం లేదు. ఇకనైనా హరీష్ కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిదేమో.. !
నిర్మాత కరువయ్యాడు. దాగుడుమూతల కథ దిల్ రాజుకి నచ్చలేదు.