‘గద్దలకొండ గణేష్’ గణేష్ పై మెగాస్టార్ కామెంట్స్


ఈ యేడాది మెగా హీరోలకి బాగా కలిసొచ్చినట్టుంది. ఈ యేడాది ప్రారంభంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు. చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది. ఇక వరుస ప్లాపుల్లో ఉన్న సాయిధరమ్ తేజ్ చిత్రలహరితో హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు. తాజాగా గద్దలకొండ గణేష్ తో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు. మంగళవారం ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. సినిమా బాగుందని కితాబిచ్చాడు. చిత్రబృందాన్ని అభినందించారు. 

ఇక ఈ యేడాది మెగాస్టార్ చిరంజీవికి కూడా చాలా ప్రత్యేకమైనది. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన  నటించిన సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో చారిత్రాత్మక చిత్రంలో నటించాలన్న చిరు కోరిక తీరింది. బాహుబలి, సాహో తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితకథతో తెరకెక్కిన చిత్రమిది. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఈ యోధుడు జీవితకథని మెగాస్టార్ ప్రేక్షకులకి చూపించబోతున్నారు.