రవిగాడు ఓ వెధవ.. పునర్నవి ఫైర్ !
బిగ్ బాస్ 3 హౌస్ లో రాహుల్ – పునర్నవి ప్రేమజంటగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట గుసగుసలు, హంగులు, ముద్దులు హైలైట్ అవుతున్నాయి. శనివారం రాహుల్ ఎలిమినేట్ అయిన సందర్భంలో అందరికి కంటే పునర్నవి ఎక్కువగా బాధపడినట్టు కనిపించింది. ఇక రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ కావడంతో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలో పున్ను ఆనందానికి అవధుల్లేవ్. ఎగిరిగత్తేసింది. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో వెళ్లి రాహుల్ గట్టిగా హగ్ చేసుకొంది. ఐతే, పున్ను మంగళవారం రాహుల్ పై ఫైర్ కావడం విశేషం. రాహుల్ వాడొక వెధవ అనేసింది. మంగళవారం కూడా ఇంట్లో సభ్యుల మధ్య ఎలిమినేషన్ పై చర్చ జరిగింది.
నామినేషన్ ప్రాసెస్ గురించి బాబా భాస్కర్, వరుణ్ చర్చించుకున్నారు. పునర్నవి తను హౌస్‌లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనకు భాష రాదని విమర్శించడం తనకు నచ్చలేదని వరుణ్ తో అన్నారు బాబా భాస్కర్. పునర్నవి కూడా రాహుల్ తో నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతుంది. సీన్ లోకి వరుణ్, వితికాలు ఎంటర్ అవ్వడంతో పునర్నవి రెచ్చిపోయింది. ‘నువ్ రవితో మాట్లాడావా..?’ అంటూ వరుణ్.. వితికాని అడగడంతో ‘నేను ఎందుకు మాట్లాడతా..’ అని వితికా చెప్పేలోపు పునర్నవి కల్పించుకుని ‘వాడా…? ఆ రవిగాడా.. వాడొక వెదవ.. ఆ వెదవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు’ అంటూ తెగ తిట్టేసింది. ఈ తిట్లు కూడా ప్రేమతోనే తింటినట్టుంది.