ట్రైలర్’తోనూ మెగాస్టార్ తో పోటీ.. అవసరమా ?

యాక్షన్ హీరో గోపీచంద్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఫైట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైరా రిలీజైన రెండురోజుల తర్వాత గోపీచంద్ ‘చాణక్య’ రిలీజ్ కానుంది. గోపీచంద్ ఏ ధైర్యంతో మెగాస్టార్ తో పోటీ దిగుతున్నాడో తెలీదు. కానీ ఇది సాహాసమేనని ఇండ్రస్ట్రీ వర్గాలు, ప్రేక్షకులు అంటున్నారు. అంతేకాదు.. ప్రమోషన్స్ విషయంలోనూ సైరాతో పోటీపడుతున్నాడు చాణక్య. సైరా మరికొద్ది నిమిషాల్లో రెండో ట్రైలర్ రాబోతున్న సంగతి తెలిసిందే. 

గోపీచంద్ చాణక్య ట్రైలర్ కూడా ఇవాళే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ ముందు తర్వాత కూడా సైరాతో పోటీపడేందుకు గోపీచంద్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం 10:30నిమిషాలకి సైరా రెండో ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక సాయంత్రం 5గంటలకి చాణక్య ట్రైలర్ రాబోతుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహించారు. మెహ్రీన్ కథానాయిక. బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఈ స్పై థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతుంది. సైరాతో పోటీ పడనుంది. సైరా ఎఫెక్ట్ ని తట్టుకొని ఏ మేరకు చాణక్య నిలబడుతుంది ? అనేది చూడాలి.