పూరి బర్త్ డే స్పెషల్ : ఇస్మార్ట్ శంకర్ రీ-రిలీజ్


దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టినరోజున అభిమానులకి హీరోయిన్ ఛార్మీ ఓ స్పెషల్ ప్లాన్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ ని రీ-రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. మాస్ ని మురిపించింది.. ఈ చిత్రం. వరుస ప్లాపుల్లో ఉన్న పూరి, ఎనర్జిటిక్ హీరో రామ్ లని బయటపడేసింది. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 28న పూరి బర్త్ డే కానుకగా ఇస్మార్ట్ శంకర్ ని రీ-రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 10థియేటర్స్ లో  ఇస్మార్ట్ శంకర్ రీ రిలీజ్ కానుంది. ఈ విషయాని ఛార్మీ ఓ వీడియో ద్వారా తెలిపింది. “హాయ్ గాయ్స్, నీ థియేటర్‌లో మళ్లీ నా బొమ్మ’ అంటూ ఓ వీడియోని ఛార్మీ అభిమానులతో పంచుకుంది. తెలంగాణలోని ఐదు థియేటర్లలో, ఏపీలోని ఐదు థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రింది తెలిపిన థియేటర్లలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు.

తెలంగాణలో థియేటర్లు

దిల్‌షుఖ్‌నగర్ : వెంకటాద్రి

వరంగల్ : లక్ష్మణ్

కరీంనగర్ : తిరుమల

ఖమ్మం : ఆదిత్య

ఖాజీపేట : భవానీ

ఏపీలో థియేటర్లు

రాజమహేంద్రవరం : ఊర్వశి

కాకినాడ : దేవీ(స్ర్కీన్ 3)

తిరుపతి : విఖాయత్

గుంటూరు : స్వామి

వైజాగ్ : గోకుల్