ఇండస్ట్రీలో వేణు మాధవ్ డాడీ ఎవరో తెలుసా ?
తెలుగు ఇండస్ట్రీకి శోక సముద్రంలో ముంచెత్తాడు హాస్య నటుడు వేణు మాధవ్. ఉన్నన్నీ రోజులు సరదా ఉంటూ.. అందరినీ నవ్వించిన వేణు వెళ్తూ వెళ్తూ అందరిచేత కన్నీరు పెట్టించాడు. గురువారం ఫిలించాంబర్‌లో వేణు మాధవ్ భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వేణుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా ఉత్తేజ్, ఉదయభాను, నరేష్.. తదితరులు వేణుని కడసారి చూసి ఏడ్ఛేశారు.
వేణుమాధవ్ మరణం మూవీ ఆర్టిస్ట్స్ కుటుంబానికి మాత్రమే నష్టం జరిగినట్టుకాదని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబంలోనూ ‘మా ఇంటి సభ్యుడ్ని కోల్పోయాం’ అన్నంత బాధ కలుగుతోందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. 1996లో రవీంధ్రభారతిలో తనను అనుకరిస్తూ మిమిక్రీ చేశాడని, ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనను డాడీ అని పిలిచేవాడని గోపాల కృష్ణ చెప్పారు. మనిషి చిన్నవాడైనా.. కొన్ని వందల సినిమాల్లో ఆరడుగుల మనిషిలా నటిస్తూ ప్రపంచానికి అద్భుతాన్ని అందించాడని కొనియాడారు. వేణుమాధవ్ ఇంత త్వరగా చనిపోతాడని తాను ఊహించలేదని అన్నారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని గోపాలకృష్ణ అన్నారు.