గుడ్ న్యూస్ చెప్పిన శివన్


ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ గుడ్ న్యూస్ చెప్పారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ చాలాబాగా పనిచేస్తోందని వెల్లడించారు.
ఆర్బిటర్‌లో అమర్చిన పరికరాలన్నీ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. ల్యాండర్‌ ‘విక్రమ్‌’ తో సంబంధాలు తెగిపోయినా తమకు ఎలాంటి సంకేతాలు రాలేదనిఆర్బిటర్‌ మాత్రం బాగానే పనిచేస్తోందన్నారు. అసలు ‘విక్రమ్‌’ నుంచి సంబంధాలు ఎందుకు తెగిపోయాయా? తప్పులేమైనా జరిగాయా? అనే అంశంపై జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తోందన్నారు.

చంద్రయాన్‌ 2 ప్రయోగం 98శాతం విజయవంతమైందని ఇటీవల శివన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. తమ తదుపరి లక్ష్యం ‘గగన్‌యాన్‌ మిషన్‌’ అని ఆయన ప్రకటించారు. ఇస్రో చరిత్రలో గగన్‌ యాన్‌ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కానుంది. 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని, సాయుధ బలగాల్లో ఫ్లయింగ్‌ అనుభవం ఉన్న టెస్ట్‌ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని భావిస్తోందని శివన్ తెలిపారు. ఇక విక్రమ్ లాండర్ సంకేతాలు తెగిపోయిన సందర్భంలో యావత్ దేశం ఇస్త్రోకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.