బిత్తిరి సత్తిపై దాడి చేసింది ఇతనే !

వీ6 యాంకర్ బిత్తిరి సత్తిపై దాడిపై జరిగింది. ఇటీవలే వీ6 నుంచి బిత్తిరి సత్తి వెళ్లిపోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతలోనే బిత్తిరి సత్తిపై దాడి చేసిన వ్యక్తి దొరికాడు. ఐతే, అతని చెబుతున్న కారణం నవ్వుని తెప్పిస్తోంది. దాడి చేసిన వ్యక్తి తాను ఫిల్మ్ రైటర్, డైరెక్టర్ కావడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పుకొంటున్నాడు. అంతేకాదు.. బిత్తిరి సత్తి తెలంగాణ బాషకు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే దాడి చేసినట్టు చెబుతున్నాడు.

ఇతడికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వ్యక్తిని పోలీసులు ఇంటరాగేట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. బిత్తిరి సత్తిపై దాడి చేసిన వ్యక్తి చెబుతున్న వింత ముచ్చట్లని మీరు ఓసారి వినేయండీ.. !