అబ్బో.. నానికి భయపడిపోతున్నారు !

హీరో నాని ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. స్టార్ హీరోలు అసూయపడేలా వరుస హిట్స్ కొడుతున్నాడు. యేడాదికి మూడ్నాలుగు సినిమాలు.. చేసినవన్నీ హిట్స్ నే గత రెండేళ్లుగా నాని ట్రాక్ రికార్డ్ ఇది. ఇప్పుడు నాని సినిమా వస్తుందంటే మిగితా హీరోలు భయపడిపోతున్నారు. ఆయనతో బాక్సాపీస్ దగ్గర పోటీకి దిగేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

నాని తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (ఎంసిఎ). దిల్ రాజు బ్యానర్’లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని-సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రమిది. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మరుసటి రోజే అఖిల్ ‘హలో’ రిలీజ్ కానుంది. ఆ తర్వాతి రోజే మెగా హీరో అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నానిని చూసి అఖిల్, శిరీష్ లు భయపడిపోతున్నారు. నాని తట్టుకోగలమా ? ప్రశ్న వారిని కంగారు పెడుతోంది.

నాగార్జున రిక్వెస్ట్ తో నాని ఎంసిఎ వచ్చే యేడాది సంక్రాంతికి వెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఐతే, ఇందులో ఏమాత్రం నిజం లేదట. చివరికి అల్లు శిరీష్ వెనక్కి తగ్గాడు. శిరీశ్ ‘ఒక్క క్షణం’ డిసెంబర్ 23కి బదులుగా ఒక్క వారం ఆలస్యంగా అంటే డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెబుతున్నారు. నానికి పోటీగా స్టార్ హీరోలు ఉన్నా.. ఇదే పరిస్థితి.