విక్రమ్ లాండర్ ఫోటోలు పంపిన నాసా.. కానీ !


ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌ 2’ వందశాతం సక్సెస్ కాలేదన్న సంగతి తెలిసిందే. విక్రమ్ లాండర్ తో సాంకేతాలు తెగిపోవడంతో ప్రయోగం 98శాతమే సక్సెస్ అయినట్టు ఇస్త్రో తెలిపింది. చంద్రయాన్ 2 ఆర్భిటల్ బాగా పనిచేస్తోంది చెప్పింది. మరోవైపు, విక్రమ్ లాండర్ జాడకనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాసా విక్రమ్ లాండర్ ఫోటోలు తీసి పంపింది. విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ముందుగా నిర్ధరించిన ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్‌ రీకానిసెన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌ఓ) కెమేరా తన చిత్రాల్లో బంధించింది. లక్షిత ప్రదేశం నుంచి 150కి.మీ ప్రాంతాన్ని ఈ చిత్రాల్లో బంధించారు.

 ఈ చిత్రాలు సెప్టెంబరు 17న తీసినట్లు తెలిపింది. ఐతే అక్టోబర్‌లో పగలు సమయం వస్తుందని.. అప్పుడు విక్రమ్‌కు చెందిన పలు ఫొటోలను తీస్తామని, ‘విక్రమ్ ల్యాండర్‌ హార్డ్‌గా ల్యాండ్ అయింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఎక్కడ ల్యాండ్ అయ్యింది అనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని నాసా తెలిపింది.  

సెప్టెంబర్‌ 7న చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విక్రమ్‌ జాడను కనుగొనేందుకు ఇటు ఇస్రోతో పాటు అటు నాసా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు విక్రమ్‌ చివరి క్షణంలో తప్పటడుగులు వేయడానికి గల కారణాలేంటో విశ్లేషించే పనిలో ఇస్రో తలమునకలైంది.