విజయశాంతి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ !


లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 11యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా విజయశాంతితో బాల్యంలో నటించిన తీపిజ్ఝాపకాలని మహేష్ గుర్తు చేసుకొన్నారు. దానికి ప్రతి స్పందనగా మహేష్ వ్యక్తిత్వం ఏ మాత్రం మారలేదు. అదే ఆయన్ని సూపర్ స్టార్ ని చేసిందని మహేష్ ని మెచ్చుకొంది రాములమ్మ.

లేడీ సూపర్ స్టార్ గురించి లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? ఆమె మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది కూడా అనిల్ రావిపూడి చిత్రమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్2’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. అసలైన సంక్రాంతి సినిమా అనిపించుకొంది. అత్యధిక లాభాలని తీసుకొచ్చిన తెలుగు సినిమా గుర్తింపు తెచ్చుకొంది. ఈ సినిమా సమయంలోనే ఎఫ్ 3 ఉంటుందని అనిల్ ప్రకటించారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ చేయబోయే సినిమా ఎఫ్3 నే. 

ఇందులో ఓ కీలకపాత్ర కోసం విజయశాంతిని ఒప్పించినట్టు సమాచారమ్. ఎఫ్ 2 కథానాయకులు వెంకీ, వరుణ్ లు కూడా సీక్వెల్ లో ఉండబోతున్నారు. వారికి విజయశాంతి తోడవ్వనునారు. కొత్త యాడ్ కానున్న మరో ఎఫ్ విజయశాంతి అన్నమాట. మహేష్ సరిలేరు నీకెవ్వరు వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఎఫ్ 2 గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. మొత్తంగా.. అనిల్ రావిపూడి రాముల్లమ్మని ఒకటి కాదు రెండు సార్లు ఒప్పించడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.