సెక్స్ స్కాండల్’లో మాజీ సీఎం, గవర్నర్ కూడా !
మధ్య ప్రదేష్ లో బట్టబయలైన సెక్స్ స్కాండల్ లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోనికి వస్తున్నాయ్. ఈ సెక్స్ స్కాండ్ లో మాజీ సీఎం, మాజీ గవర్నర్ కూడా ఉన్నారట. అంతేకాదు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పలువురు రాజకీయ నాయకులు ఈ స్కాండ్ లో ఉన్నట్టు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేకి చెందిన పలువురు కీలక నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఐదుగురు మహిళలు సాగించిన సెక్స్ స్కాండల్ ఇది. అధికారులను, రాజకీయ నేతలను ప్రలోభ పెట్టి, వారితో లైంగిక కార్యకలాపాలు, సంభాషణల వీడియోలు, ఆడియోలను రికార్డు చేస్తారు. తర్వాత వారిని బెదిరించి భారీగా డబ్బు వసూలు గుంజడం ఈ మహిళా ముఠా చేసిన పని. ఈ ముఠా కాలేజీ అమ్మాయిలకి జాబ్ ఆశచూపి, వారిని ప్రముఖుల పక్కలోకి పంపడం చేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు.. బాలీవుడ్ లో ద్వితీయశ్రేణి హీరోయిన్స్ కి ఈ స్కాండ్ తో సంబంధం ఉన్నట్టు టాక్.
ఈ సెక్స్ స్కాండల్ ఎలా బయటికొచ్చిందంటే.. ? తనపై చిత్రీకరించిన సెక్స్ వీడియోను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని ఆర్తీ దయాళ్ అనే మహిళ డిమాండ్ చేశారంటూ ఇండోర్ నగరపాలక సంస్థ అధికారి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అధికారి నుంచి తొలి విడతగా రూ.50 లక్షల వసూలు కోసం బయల్దేరిన ఆర్తీ దయాళ్ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికొస్తున్నాయ్. విచారణ పూర్తయితే.. ఎంత మంది ప్రముఖులని మహిళాముఠా వలలో చిక్కారనే విషయంలో మరింత క్లారిటీ రానుంది.