సైరా క్లైమాక్స్ లో చిరు కనబడట !
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మొదటి నుంచి చర్చ జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులకి విషాదంత ముగింపుని ఇష్టపడరు. వాస్తవ కథ ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని తలని నరికి.. దాన్ని కోట గుమ్మానికి వేలాడతీయడం చూపించాలి. ఐతే, సినిమాలో ఇదంతా చూపించరని తెలిసింది.
నరసింహారెడ్డి హస్తమించిన సీన్ ఒక్కటి మాత్రమే చూపించి.. ఆ తర్వాత పలు ఉద్యమాలకు నరసింహారెడ్డి పోరాటం ఎలా స్ఫూర్తిని పంచిందో చూపించబోతున్నట్టు సమాచారమ్. ఆ సందర్భంగా వచ్చే వాయిస్ ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చారు. క్లైమాక్స్ లో ఆఖరి 15 నిమిషాలు చిరు కనిపించరని చెబుతున్నారు. ఆయన కనిపించకున్నా.. అంతకుముందు వరకు ఆయన వీరోచిత పోరాటాన్ని చూసిన ప్రేక్షకులు ఇంకా ఆయన తెరపై కనిపిస్తున్నటే ఫీలయ్యేలా క్లైలాక్స్ ఉందబోతుందని చెబుతున్నారు.
సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్దిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు.