‘గద్దలకొండ గణేష్’ తొలివారం కలెక్షన్స్ ఎంతంటే ?


బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సినిమాలకి ఫస్ట్ డే, వీక్ కలెక్షన్స్ అదిరిపోతుంటాయ్. ‘గద్దలకొండ గణేష్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ, వర్షాలు కొంతమేర కలెక్షన్స్ కి గండికొట్టాయని చెప్పాలి. గతకొద్దిరోలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో. దీంతో ప్రజలు బయటికొచ్చే పరిస్థితి లేదు. సరదగా సినిమాకి వెళ్దామనే సీన్ అంతకంటే కనిపించడం లేదు. అయినా.. గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ లో బాగానే రాబట్టింది.రూ. 19.63కోట్ల షేర్ ని రాబట్టింది.

శనివారం నుంచి దసరా సెలవులు కావడంతో రెండో వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోవడం ఖాయం. దీనికి తోడు పోటీలో మరో సినిమాలేదు. అక్టోబర్ 2నసైరా వచ్చే వరకు గద్దలకొండ గణేష్ దే హవా. ఈలోగా ఈ సినిమా కలెక్షన్స్ దగ్గర దగ్గరగా రూ. 50కోట్లకి చేరువవుతాయేమో చూడాలి. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్లు బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లేవని చెబుతున్నారు.

ఇక ఏరియాలవారీగా గద్దలకొండ గణేష్ తొలివారం వసూలు చూస్తే..

* నైజాం – రూ.  6.15 కోట్లు 

* సీడెడ్ – రూ. 2.80కోట్లు

* వైజాగ్ – రూ. 2.10కోట్లు

* గుంటూరు రూ. – 1.50కోట్లు

* ఈస్ట్ – రూ. 1.25 కోట్లు

* వెస్ట్ – రూ. 1.22కోట్లు

* కృష్ణా – రూ. 1.28కోట్లు

* నెల్లూరు – రూ. 0.73కోట్లు

=> ఏపీ + తెలంగాణ కలిపి రూ.  17.03 కోట్లు

=> రెస్టాఫ్ ఇండియా – రూ. 1.10కోట్లు

=>  రెస్టాఫ్ వరల్డ్ – రూ. 1.50 కోట్లు