ఏ మంత్రి ఎక్కడ తరలిపోతున్నాడు ?
ప్రస్తుతం ఉన్న తెలంగాణ సెక్రటేరియట్‌ను కూల్చి కొత్తగా నిర్మించనుండటంతో వివిధ శాఖలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐతే, మంత్రులంతా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో విధిగా నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారమ్. ఈ నేపథ్యంలో మంత్రులంతా హుటాహుటిన మినిస్టర్స్ క్వార్టర్స్‌కు తరలి వెళ్తున్నారు. ఇక, ఏ మంత్రి ఎక్కడికి షిఫ్ట్ కానున్నారనే వివరాలు క్రింద చూడొచ్చు.
1. ముఖ్యమంత్రి – హెచ్ఎంఆర్ఎల్, రసూల్ పురా, బేగంపేట్.
2. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.. డీజీపీ కార్యాలయం, లక్డీకాపూల్.
3. ఈటల రాజేందర్ – బీఆర్కేఆర్ భవన్.
4. ఇంద్ర కరణ్ రెడ్డి – ఎండోమెంట్ కార్యాలయం, బోగ్గులకుంట, అబిడ్స్.
5. కొప్పుల ఈశ్వర్ – సంక్షేమ భవన్.
6. ఎరబెల్లి దయాకర్ రావు – రంగారెడ్డి జడ్పీ కార్యాలయం, ఖైరతాబాద్.
7. జగదీష్ రెడ్డి – టీఎస్ఎస్పీడీపీఎల్, మింట్ కాంపౌండ్.
8. నిరంజన్ రెడ్డి – హాకా భవనం, లక్డీకాపూల్.
9. వి. శ్రీనివాస్ గౌడ్ – రవీంద్ర భారతి, లక్డీకాపూల్.
10. మల్లారెడ్డి – మహిళా శిశు సంక్షేమ భవన్, రోడ్ నెంబర్: 45, జూబ్లీహిల్స్.
11. తలసాని శ్రీనివాస్ యాదవ్ – బీఆర్కేఆర్ భవన్.
12. ప్రశాంత్ రెడ్డి – ఈఎన్సీ, ఎర్రమంజిల్.
13. కేటీఆర్ – మునిసిపల్ కాంప్లెక్స్, ఏసీ గార్డ్స్, మాసబ్ టాంక్.
14. హరీష్ రావు – అరణ్య భవన్, లక్డీకాపూల్.
15. సత్యవతి రాథోడ్ – సంక్షేమ భవన్.
16. గంగుల కమలాకర్ – బీసీ కమిషన్, ఖైరతాబాద్.
17. పువ్వాడ అజయ్ – రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్, ఖైరతాబాద్.
18. సబితా ఇంద్రారెడ్డి – ఎస్సీఈఆర్టీ, బషీర్‌బాగ్.