పవన్ మెచ్చిన బతుకమ్మ సాంగ్.. ఇదే !


తెలంగాణ బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కొత్త బతుకమ్మ పాటలు క్యూ కడుతున్నాయి. ఎప్పటిలాగా ఈ  యేడాది యాంకర్ మంగిలి నుంచి కొత్త బతుకమ్మ పాట వచ్చేసింది. అది జనాల నోళ్లలో నానుతోంది. ఇక తాజా బతుకమ్మ పాతల్ల్ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెచ్చిన పాట ఒకటి ఉంది. అదే విమలక్క తీసుకొచ్చిన బతుకమ్మ పాట. 

ఆ పాటను పవన్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. ప్రజా సమస్యలపై పాటలతో గొంతెత్తె విమలక్క… ఈ సారి నల్లమల అడవుల రక్షణపై పాట రూపొందించారు. నల్లమల ఫారెస్టులో ఉన్న విలువైన సంపద గురించి చెబుతూనే.. మరోవైపు తాము ఎలా పోరాటం చేస్తామనే విషయాన్ని తన పాటలో పొందుపర్చారు.  నల్లమల ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు అనుమతించబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై అసెంబ్లీ తీర్మాణం కూడా చేశారు. అయినా.. కేంద్రం వెనక్కి తగ్గకపోతే పోరాటం చేస్తామని శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.