బాలీవుడ్ నటుడు వీజూ కోఠె ఇకలేరు

బాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు వీజూ కోఠె (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మల్టీఫుల్ ఆర్గాన్ పెయిల్యూర్ కావడంతో ఆదివారం రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈరోజే వీజూ కోరే అంత్యక్రియలు చందన్ వాడిలో జరగనున్నాయి. ‘షోలే’ సినిమాలో డెకాయిట్‌ కాలియా పాత్రతో విజు పాపులర్‌ అయ్యాడు.

హిందీ, మరాఠీ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గా నిలిచారు. 1964 సంవత్సరంలో యా మలక్ చిత్రంలో చేసిన పాత్ర తన సినీ జివితాన్ని మలుపు తిప్పింది. షోలే, అందాజ్ అప్నా అప్నా, ఖుర్బాని, ఖర్జ్, నగీనా, చైనాగేట్ తదితర చిత్రాల్లో నటించారు. విజు కోఠె తండ్రి నందూ కొఠె రంగస్థల నటుడు, అత్త దుర్గ కొఠె ప్రముఖ నటి. వీజూ కొఠె అక్క శుభ కోఠె కూడా సీనియర్ నటి. విజు నటించిన చివరి చిత్రం జానే క్యూ దె యారాన్ (2018). విజు మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.