గోపీచంద్ కు భయంకరమైన యాక్సిడెంటు.. !


యాక్షన్ హీరో గోపీచంద్ కు భారీ యాక్సిడెంట్ అయింది. ఆయన కాలి నరాలు తెగిపోయాయ్. దీంతో దాదాపు మూడు గంటల పాటు రక్తం కారుతూనే ఉంది. ఫైనల్ గా ఆయన్ని హాస్పటిల్ లో చేయించి చికిత్స అందించారు. ఇది ‘చాణక్య’ సినిమా సమయంలో జరిగిన ప్రమాదం. తిరు దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం చాణక్య. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. దసరా కానుకగా ఈ వారమే (అక్టోబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తనకి జరిగిన భయంకరమైన యాక్సిడెంట్ గురించి చెప్పారు గోపీచంద్. చాణక్య సినిమాలో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయట. వాటిని అన్నింటినీ చక్కగా తెరకెక్కించాట. 

“చివరి రోజు చాలా చిన్న షాట్ ప్లాన్ చేశారట. పరిగెత్తుకుంటూ వచ్చి స్టార్ట్ అయి ఉన్న బైక్‌ను తీసుకెళ్లాలి. ఐతే ఆ బైక్‌కు కొంచె ప్రాబ్లమ్ ఉండడంతో ఫుల్‌గా రైజ్ అయిపోయింది. కంట్రోల్ చేయడం కష్టమైంది. వదిలేద్దామంటే ఎదురుగా ఇద్దరు కెమేరామెన్లు ఉన్నారు. అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించా. కుదరలేదు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే నరాలు కట్ అయ్యి రక్తం రావడం మొదలైంది. అది మారుమూల పల్లె ప్రాంతం కావడంతో దగ్గర్లో హాస్పిటల్ లేదు. దీంతో 3 గంటలపాటు ప్రయాణించి హాస్సిటల్‌కు వెళ్లాం. ఆ మూడు గంటలూ రక్తం కారుతూనే ఉంద”ని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న గోపీచంద్ తెలిపారు.