అమీ జాక్సన్ కొడుకుని చూశారా ?


హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండా తల్లి అయిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌కు చెందిన జార్జ్ పానేయిటోయుతో అమీ కొన్నాళ్ల పాటు డేటింగ్‌ చేసింది. దాంతో పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో హడావుడిగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇటీవలే అమీ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.  తాజాగా అమీ తన కొడుకు ఫోటో  ఒకటి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బుడ్డోడు భలే ఉన్నాడు. ముద్దొస్తున్నాడు. బుడ్డోడి ఫోటోపై ‘నాట్ లిటిల్.. ఫర్ లాంగ్’ అనే కామెంట్ రాసి ఉంది.

‘ఎవడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అమీ జాక్సన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ, రోబో 2.ఓ చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత అమీ మరో సినిమా చేయలేదు. అప్పటికే ఆమె గర్భవతి అయింది. అది కూడా పెళ్లి కాకుండానే.  లండన్ కు చెందిన పారిశ్రామిక వేత్త జార్జ్ పయనట్టుతో ప్రేమలో పడింది. త్వరలోనే కొడుకొని ఎత్తుని అమీ ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకోనుందని సమాచారమ్.