డిన్నర్’కి వెళితే.. అన్నీ సమర్థించుకోవాల్సిందే !
క్యాస్టింగ్ కౌచ్ పుణ్యమా అని కొన్ని పదాలకి కొత్త కొత్త అర్థాలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇండస్ట్రీ ఎవరు నేరుగా పడుకొంటావా ? పడకగదికి వస్తావా ? కోరికలు తీరుస్తావా ?? అని అడగరట. వాటికి కొన్ని కోడ్స్ ఉంటాయట. టాలీవుడ్ లో అయితే కమిట్ ఇస్తావా ? అని అడుగుతారట. ఇక బాలీవుడ్ లో దానికి ఓ కోడ్ ఉంది. అదే డిన్నర్. డిన్నర్ కి వస్తావా ? అని అడిగితే పడకగది పిలుపే అన్నమాట. ఈ విషయాన్ని బాలీవుడ్ నటి, మోడల్ షర్లిన్ చోప్రా బయటపెట్టింది. ఆమెకి ఇండస్ట్రీకి వచ్చిన రెండేళ్లపాటు డిన్నర్ పిలుపులు రాలేదట. ఆ తర్వాత మాత్రం తరచు డిన్నర్ కి పిలిచేవారట. అలా వెళ్లి వెళ్లి చిరాకేసి.. సినిమాలకి దూరమయ్యానంది.
ఇటీవల షెర్లిన్ చోప్రా ఓ వీడియో సాంగ్ చేసింది. ఈ వీడియో ప్రమోషన్స్ లో పాల్గొన్న షెర్లిన్ బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. డిన్నర్ అసలు అర్థం ఏంటన్నది అందరికీ అర్థమయ్యేలా తెలిపింది. ఎక్కడ చూసిన కామాంధులు ఉన్నారు. బాలీవుడ్ లో ఉన్నారు. హీరోయిన్స్ ను వర్క్ కోసం మాట్లాడాలని డిన్నర్ కి రమ్మంటారు. డిన్నర్ అంటే అర్థం.. మొత్తం సమర్పించుకోవాలని. ఆ రాత్రి వారితో గడపాలని చెప్పుకొచ్చింది. ఐతే, ఇప్పటి వరకు షెర్లిన్ ఎంతమందితో ఎవరితో డిన్నర్ చేసింది అనేది మాత్రం చెప్పలేదు. ఐతే, లిస్టులో చాలామందే ఉన్నారని మాత్రం హింట్ ఇచ్చేసింది.