పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించిన మన్మోహన్


భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు సమాచారమ్. కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభోత్సవానికి రావాలన్న పాక్‌ మన్మోహన్ సింగ్ ని ఆహ్వానించింది. ఈ మేరకు ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహ్మద్‌ ఖురేషి ఓ వీడియో సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని కాదని మన్మోహన్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఐతే, పాక్ ఆహ్వానం తిరస్కరించిన మన్మోహన్‌ ఆ దేశం విషయంలో దేశంలో అధికార పక్షం, ప్రతిపక్షాలది ఒకే మాట అనే సంకేతాలిచ్చినట్టు అయింది.