ఫైటర్ కోసం జాన్వీ కపూర్ !


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ తో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మించనుంది. ఈ సినిమా కోసం ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నట్టు సమాచారమ్. ఇంకా చెప్పాలంటే ఫైటర్ ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాకి సీక్వెల్ లా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఫైటర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీసుకున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయ్. జాన్వీ ఓకే చెప్పాల్సి ఉంది. విజయ్ అంటే జాన్వీకి ఇష్టం. ఆ ఇష్టాన్ని గతంలో కాఫీ విత్ కరణ్ షోలో బయటపెట్టింది కూడా. తనకి అవకాశం వస్తే విజయ్ దేవరకొండలా మారాలని ఉందని కామెంట్ చేసింది. ఆయనతో కలిసి నటించాలనే కోరికని బయటపెట్టింది. ఐతే, ఇప్పుడా అవకాశం జాన్వీకి వచ్చింది. మరీ.. విజయ్ జాన్వీకి ఓకే చెబుతుందేమో చూడాలి.