‘ఆవిరి’కి ఊపిరి పోసిన మహేష్


‘అదిగో’ తర్వాత రవిబాబు నుంచి వస్తున్న చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమాని దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఆవిరి టీజర్స్ వరుసగా మూడు క్యూ కట్టాయి. వాటిని చూసి ఆవిరి అవును3 అంటున్నారు. పెద్దగా రెస్పాన్స్ కూడా లేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ ని రంగంలోకి దించినట్టు కనిపించింది. ఆవిరి టీజర్ పై మహేష్ స్పందించారు. ‘హారర్‌ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇలాంటి తరహా సినిమాల్ని తీయడంలో రవిబాబు మాస్టర్‌. మీకు, మీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్‌ రవి’ అంటూ మహేష్ రాసుకొచ్చారు.

దిల్ రాజు బ్యానర్ లో సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి సినిమాకు దిల్ రాజు సహనిర్మాత. మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ దిల్ రాజు భాగస్వామ్యం ఉంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు సమర్పిస్తున్న ఆవిరి చిత్రాన్ని మహేష్ ప్రమోట్ చేశారన్నది స్పష్టం అవుతోంది. ఇక ‘ఆవిరి’లో రవిబాబుతోపాటు నేహా చౌహాన్‌, భరణి శంకర్‌, ముక్తర్‌ ఖాన్‌, శ్రీ ముక్తా, హిమజా తదితరులు నటిస్తున్నారు.