ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు


2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్‌ పనిచేయదు. ఐతే, అది కొన్ని ఫోన్లలో మాత్రమే. ఐఓఎస్‌ 8తో పనిచేసే యాపిల్‌ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌ ఫోన్లలోనూ వాట్సాప్ పనిచేయదు. ఈ మేరకు వాట్సాప్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.  ఇంకా ఎవరైనా తమ యాపిల్‌ ఫోన్లలో ఐఓఎస్‌ 8 ఉపయోగిస్తున్నట్లయితే.. వారు కొత్త వాట్సాప్‌ ఖాతా రూపొందించలేరని, అలానే ఉన్న ఖాతాను కొనసాగించలేరని తెలిపింది. కాబట్టి ఆ యూజర్స్‌ అంతా వీలైనంత త్వరగా ఐఓఎస్‌ 9 లేదా తరువాతి వెర్షన్‌కి అప్‌డేట్‌ కావాలని సూచించింది.