మహేష్ రూల్స్ బ్రేక్ చేశాడు


మహేష్ రూల్స్ బ్రేక్ చేశాడు. దానికి ఫలితం అనుభవించక తప్పదు అంటున్నారు. ఐతే, ఇక్కడ మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ మహేష్ విట్టా. ఇప్పటివరకు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు. ఆయనకి బాబా భాస్కర్, శ్రీముఖీ, శివజ్యోతి, వరుణ్ సందేశ్ ల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. దాంతో.. ఏ ఒక్క తప్పిదం చేసిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సోమవారం ఏపీసోడ్ లో  మహేష్ అలాంటి తప్పే చేశాడు. ఎలిమినేష్ ని నామినేషన్ టాస్క్ లో మహేష్ రూల్స్ బ్రేక్ చేశాడు. గందరగోళంగా వ్యవహరించాడు.

మహేష్ రాళ్ళు సంపాదించుకోవడం వరకు బాగానే ఉంది. కానీ అవతలి వాళ్ళు తన రాళ్ళని తీసుకుందామని ప్రయత్నిస్తే సీరియస్ అయ్యాడు. నువ్వెందుకు లాక్కోవడం నేనే ఇస్తా అంటూ రాళ్ళు పడేశాడు. లాక్కుంటుంటే డిఫెండ్ చేయాల్సింది పోయి, గేమ్ ఆడనంటూ నిర్ణయం తీసుకున్నాడు. గేమ్ ప్రకారం ఎవరైనా లాక్కోవచ్చు. అసలు అలా లాక్కోవడం, లాక్కుంటుంటే డిఫెండ్ చేయడమే ఆట ప్రధాన ఉద్దేశ్యం. ఐతే, మహేష్ గేమ్ రూల్స్ తప్పాడు. ఆ తర్వాత రియలైజ్ అయినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈవారం మహేశ్ గనుక ఎలిమినేషన్ లిస్టులోకి వస్తే.. ఆయనకి చెక్ పడినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయ్.