బంపర్ రేటుకు సైరా కర్ణాటక రైట్స్
మరోసారి తెలుగు సినిమా పేరు దేశంలో మారుమ్రోగిపోతుంది. ‘బాహుబలి’ ఆ తర్వాత ‘సాహో’ గురించి దేశం, ప్రపంచం మొత్తం మాట్లాడుకొంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో ప్యాన్ ఇండియా సినిమా సైరా. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రమిది. తొలితరం స్వాత్రంత్య్ర సరమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4600 థియేటర్స్ లో రేపు (అక్టోబర్ 2) రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ రూ. 28కోట్లకి అమ్ముడుపోయాయ్. ఇది మంచి రేటని చెప్పవచ్చు. కర్ణాటకలో చిరంజీవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి భారీగా అభిమానులు తరలివచ్చారు. వేదిక కూడా సరిపోలేదు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అభిమానులకి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక తాజా సైరా కర్ణాటక రైట్స్ కి పలికిన రేటుని చూస్తుంటే సైరా కోసం అక్కడి ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న విషయం అర్థమవుతోంది.
ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు.