సైరాకు కోర్టు చిక్కులు తొలగాయ్ !
మెగా అభిమానులకి గుడ్ న్యూస్. సైరా చిత్రానికి న్యాయపరమైన చిక్కులు తొలగాయి. సైరా చిత్రాన్ని మొదట బయోపిక్ అని, ఇప్పుడు కాదని.. చరిత్రని తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు తెలుగుయువసంఘం నాయకులు కేతిరెడ్డి పిటీషన్ దాఖలు చేయగా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. సినిమాని సినిమాలానే చూడాలని, సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని తెలిపింది. గతంలో గాంధీజీ, మొగల్‌ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ప్రస్తావిస్తూ సైరా చిత్రంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవ్వరు చూపించారని కోర్టు ప్రశ్నించింది.
ఈ చిత్రానికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలితరం స్వాత్రంత్య్ర సరమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. సాహో తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సైరా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4600 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.