గోల్కొండ కోట‌లో దావ‌త్ అదుర్స్

జీఈఎస్ పారిశ్రామిక స‌ద‌స్సుకు వ‌చ్చిన వారికి మొద‌టి రోజు ఫ‌ల‌క్ నూమా ప్యాలెస్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన ప్ర‌భుత్వం.. రెండో రోజు కూడా అందుకు ఏ మాత్రం తగ్గ‌కుండా హైద‌రాబాద్ సంస్కృతికి అద్దంప‌ట్టేలా అంతే గ్రాండ్ గా దావ‌త్ ఏర్పాటు చేసింది. 150 దేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌తినిధులంద‌రికీ గోల్కొండ కోట‌లో అదిరిపోయే ఏర్పాట్లు చేసింది.

రంగురంగుల లైటింగ్స్ తో గోల్కొండ కోట వైభ‌వాన్ని ప్ర‌తిబింబిస్తూ, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో హైద‌రాబాద్ సంస్కృతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ర‌క‌ర‌కాల హైద‌రాబాదీ రుచుల‌ను వండి వ‌చ్చిన ప్ర‌తినిధుల‌కు వారెవ్వా అనేలా వారికి వ‌డ్డిస్తున్నారు. జిగేల్ జిగేల్ అంటున్న రంగురంగుల వెలుగుల మ‌ధ్య కోట ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆడుతూ పాడుతూ.. రుచుల్ని ఆహ్వానిస్తూ ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్నారు.. ఇదిగో ఆ దృశ్యాల‌ను మీరు ఆస్వాదించండి..