‘ఆర్ఆర్ఆర్’ నుంచి కీలక సీన్ లీక్ !


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడీ సినిమా నుంచి కీలక సీన్ ఒకటి లీకైంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన విప్లవ వీరుడుగా మారే క్రమంలో అనుభవించిన ఓ సన్నివేశాన్ని చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారట. ఈ సీన్ లో చరణ్ తో తాళ్లతో కట్టేసి అతి దారుణంగా కొడుతూ.. ఈడ్చుకెళ్తారట. ఇప్పుడీ సీన్ లీకైంది. ఇంతకీ ఈ సీన్  ని లీక్ చేసింది ఎవరో తెలుసా? స్వయంగా మెగాస్టార్ దంపతులు.

అవునూ.. ఇది నిజం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ రామ్ చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. ఇటీవల RRR షూటింగ్ చూడటానికి చిరంజీవి దంపతులు అక్కడికి వెళ్లారట. ఆ సమయంలో రామ్ చరణ్‌ని తాళ్లతో కట్టి కొడుతూ ఈడ్చుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. అలా ఆ సీన్ చూడగానే చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారట. ఇక సురేఖ అయితే కన్నీళ్లు పెట్టుకొందట. ఈ విషయాన్ని సైరా ప్రమోషన్స్ లో పాల్గొన్న చిరు తెలిపారు.

ఇక మెగస్టార్ సైరా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి, సాహో తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4600 థియేటర్స్ లో సైరా రిలీజ్ అవుతోంది.