సీఎం జగన్ పై సీబీఐ ఆందోళన


ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీబీఐ ఆందోళన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.జగన్ అభ్యర్థనపై తాజాగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

జగన్ ఎంపీ ఉన్న సమయంలో సాక్ష్యాలను తారుమారు చేస్తారనే కారణంతోనే గతంలో ఆయనను అరెస్టు చేశామని సీబీఐ పేర్కొంది. సీఎం కుమారుడిగా ఉన్నప్పుడే జగన్‌పై అక్రమ లావాదేవీల అభియోగాలు ఆయనపై ఉన్నాయని కౌంటర్‌లో వివరించింది. ఆయన జైల్లో ఉన్నప్పుడే తన బలాన్ని ప్రదర్శించి సాక్షులను ప్రభావితం చేశారని.. ఒక ప్రభుత్వాధినేతగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ఇప్పుడు మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సిబిఐ ప్రజాప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగత హాజరు మినహాయింపు అభ్యర్ధన తిరస్కరించాలని కౌంటర్ లో పేర్కొంది.