మళ్లీ ఫ్రొఫెసర్ నే నమ్ముకొంటున్న టీ-కాంగ్రెస్


తెలంగాణలో కాంగ్రెస్ లో పూర్తిగా ముందు చూపు కరువైంది. ఆ పార్టీ నేతలకి పదవులపై ఉన్న ధాస ఎన్నికల వ్యూహాలపై లేదు. తీరా ఎన్నికలు దగ్గరపడ్డాక హడావుడి పోత్తులు, సీట్ల పంపకాలతో గత యేడాది చివరల్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగానే దెబ్బతింది. తెరాస ప్రభంజనాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తే సీపీఐ మద్దతు ఆ పార్టీకే దక్కేది. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏర్పాటైన మహాకూటమిలో సీపీఐ భాగస్వామి. పైగా సీపీఐ ఎప్పుడు అధికార పక్షానికి మద్దతు ఇవ్వదు. 

అయినా.. సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతతో హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సీపీఐ మద్దతు కూడగట్టగలిగారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మళ్లీ ప్రొఫెసర్ కోదండరామ్  ని నమ్ముకొన్నట్టు కనబడుతోంది. మంగళవారం కాంగ్రెస్ నేతలు కోదండరామ్ తో సమావేశమయ్యారు. హుజూర్ నగర్ లో తమకు మద్దతు ఇవ్వాలని కోరాతు. పార్టీలో చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని కోదండరామ్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కోదండరామ్ నమ్ముకొంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీ-జేఏసీ ని నడిపించిన అనుభవం ఉన్న కోదండరామ్ మహాకూటమి మహా అద్భుతంగా నడిపారని భాంచారు. కానీ వర్కవుట్ కాలేదు.

ఎందుకంటే ? కోదండరామ్ టార్గెట్ కేసీఆర్ అన్నారు. కానీ, తెరాస అభివృద్ధిపై కచ్చితమైన ప్రణాఌకతో ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. రాజకీయాల్లో వ్యక్తిగత టార్గెట్ తో లక్ష్యాన్ని చేధించలేరని మహాకూటమి రుజువు చేసింది. ప్రజా సమస్యలపై, తెలంగాణ అభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉన్న తెరాసకే ప్రజలు మరోసారి జై కొట్టారు. ఇక ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి కోదండరామ్ సపోర్ట్ చేసిన అదనంగా ఒరిగేది ఏమీ లేదన్నది స్థానిక ప్రజల మాట.