వైరల్ : రామ్ జిమ్ వీడియో.. 450కేజీలతో కసరత్తులు

సినీ స్టార్స్ జిమ్ వీడియోలు బయటకు రావడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాం. వీటికి భిన్నంగా ఉంది ఎనర్జిట్ హీరో రామ్ జిమ్ వీడియో. రామ్‌ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. నటించబోయే పాత్రకు అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకుంటూ ఉంటారు. తన తదుపరి సినిమా కోసం రామ్ కసరత్తులు మొదలెట్టారు. ఇందులో భాగంగా 1000 పౌండ్లతో (దాదాపు 450 కిలోలు) లెగ్‌ ప్రెస్‌ కసరత్తులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

దీనికి #RAPO18 ‬అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. రామ్ 18వ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉండనుంది. వీరి కలయిలో గతంలో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలు వచ్చాయ్. వీటిలో నేను శైలజ సూపర్ హిట్ అయింది. ఉన్నది ఒక్కటే జిందగి యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇక, వీరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం క్రైమ్‌ నేపథ్యంలో ఉండనున్నట్టు తెలుస్తోంది. తమిళ హిట్‌ ‘తడమ్‌’కి తెలుగు రీమేక్‌గా ఇది తెరకెక్కనుంది.