నన్ను ఇద్దరు దర్శకులు గోకారు
క్యాస్టింగ్ కౌచ్, మీటూ వివాదంలో ఇప్పటికే అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మోడల్, బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ తనకి ఎదురైన లైంగిక వేధింపులని బయటపెట్టింది. ఇద్దరు దర్శకులు ఒక్క రోజు రాత్రి తమతో గడపాలని అడిగాడని తెలిపింది. ఐతే, వారి పేర్లని మాత్రం బయటపెట్టలేదు. ఇంకా ఎల్లీ ఏమన్నది అంటే.. ?
‘నటిని కావాలని ఆఫర్ల కోసం తిరుగుతున్నప్పుడు.. చాలా మంది హేళన చేశారు. నువ్వు ఎప్పటికీ నటివి కాలేవని విమర్శించారు. వేధింపులు కూడా ఎదురయ్యాయి. ఆఫర్ల కోసం కొన్ని మీటింగ్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు దర్శకులు నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి… వారి వేలితో గోకారు. ఓ రాత్రి తమతో గడపమని అడిగారు. చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం” అంటూ తన సినిమా కష్టాలు చెప్పుకొచ్చింది ఎల్లీ.