ఈ నెల 5 నుంచి ఆర్టీసీ సమ్మే
ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి.. ఓ ముసాయిదాని ప్రభుత్వానికి సర్పించేందుకు సోమేష్‌కుమార్ కమిటీ ని నియమించింది. ఈ కమిటీ వెంటనే పనులు ప్రారంభించింది. బుధవారం ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపింది. ఐతే, చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 5 నుంచి సమ్మె ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి.
ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని.. కార్మికులందరూ ఈ నెల 5 నుంచి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ప్లాన్ బీ రెడీ చేసినా సమ్మె మాత్రం ఆగదని హెచ్చరించాయి. ఆర్టీసీ కార్మికులు అందరూ ఏకతాటిపైకి రావాలని కోరాయి. మరోవైపు, ఆర్టీసీ అధికారులతో, కార్మికులతో చర్చించినట్లు సోమేష్ కుమార్ తెలిపారు. దసరా పండుగ దృష్ట్యా సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల 26 డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. గడువు కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలను కోరినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మే విరమించేది లేదని అంటున్నారు.