రివ్యూ : వార్


చిత్రం : వార్ (2019)

నటీనటులు : హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్, వాణి కపూర్ తదితరులు

సంగీతం : విశాల్ శేఖర్

నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా

దర్శకత్వం : సిద్దార్థ్ ఆనంద్

నిర్మాత :  ఆదిత్య చోప్రా

రిలీజ్ డేట్ : అక్టోబర్ 2, 2019.

రేటింగ్ : 3/5

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల బాలీవుడ్ మల్టీస్టారర్ ‘వార్’. వాణీ కపూర్ హీరోయిన్. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.ఆదిత్య చోప్రా నిర్మించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘వార్’ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘వార్’ నుంచి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’కు బాలీవుడ్ లో ఇతర బాషల్లో గట్టిపోటీ ఏర్పడింది. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన వార్ ఎలా సాగింది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

చాలా సింపుల్ స్టోరీ. ఓ రాబరీ చూట్టూ తిరుగుతుంది. ఆ రాబరీ హృతిక్ రోషన్ చేశాడు. ఎలా చేశాడు ? ఎందుకు చేశాడు ?? ఆ రాబరీని తిరిగి రికవరి చేయడానికి వచ్చిన టైగర్ ష్రాఫ్ ఎవరు ? కథలో వాణీ కపూర్ పాత్ర ఏంటీ ?? అన్నది ట్విస్టులు, ఫుల్ యాక్షన్ తో కూడిన కథే వార్. ఐతే, కథ-కథనం కంటే యాక్షన్ ని హైలైట్ చేస్తూ.. మాస్ ప్రేక్షకులని టార్గెట్ చేసి తీసిమా ఇది.

ప్లస్ పాయింట్స్ :

* హృతిక్ రోషన్ నటన

* యాక్షన్ సీన్స్

* ట్విస్టులు

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* రొటీన్ స్టోరీ

ఎవరెలా చేశారంటే ?

‘వార్’ టైటిల్ లోనే యాక్షన్ ఉంది. దానికి తగ్గట్టుగానే యాక్షన్ హైలైట్ చేస్తూ సినిమా తీశారు. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ నే అదిరిపోయింది. ఆయనతో చేయించిన ఫైట్స్, డ్యాన్సులు అదిరిపోయాయ్. మాస్ మురిపించేలా ఉన్నాయి. నటనలోనూ హృతిక్ అదరగొట్టాడు. మరో హీరో టైగర్ ష్రాఫ్ ఫైట్స్, డ్యాన్స్ లు బాగా చేశాడు. కానీ, నటనలో తేలిపోయాడు. హీరోయిని వాణీకపూర్ గ్లామర్ షో సినిమాకి ప్లస్ అయింది. సినిమాలో మొత్తం.. యాక్షన్ అదిరిపోయింది. ట్విస్టులు బాగానే వర్కవుట్ అయ్యాయి. కానీ, కథ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు. యాక్షన్ సీన్స్ పై పెట్టిన శ్రద్దా కథపై పెడితే.. ఇండియన్ సినిమా హిస్టరీ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ గా ‘వార్’ నిలిచింది. యాక్షన్ ప్రియులకి మాత్రం వార్ బాగా నచ్చుతుంది. మిగితా ప్రేక్షకులకి వార్ ని ఇష్టపడకపోవచ్చు.

సాంకేతికంగా : 

యాక్షన్ సినిమాల్లో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇందులోనూ నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉంది. ఫైట్స్ అదిరిపోయాయ్. హృతిక్, టైగర్ ఇద్దరు ఫోటీపడీ మరీ ఫైట్స్, డ్యాన్స్ చేశారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే వార్ తీవ్రత ఇంకాస్త ఎక్కువగా ఉండేది.

చివరగా : వావ్..  ‘వార్’ !

రేటింగ్ : 3/5