‘సైరా’లో స్వీటీ లుక్ చూశారా.. ?

మెగా అభిమానుల ఎదురుచూపులు ముగిశాయ్. భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలని అందుకొనేలానే సినిమా ఉంది.బ్లాక్ బస్టర్  హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే రికార్డులు క్రియేట్ చేసింది విశ్లేషకులు చెబుతున్నారు. ఆ లెక్కలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఈ విషయం పక్కనపెడితే.. సైరా సినిమా మొత్తంలో స్వీటీ అనుష్క పాత్రే సస్పెన్స్. రిలీజ్ కి ముందు ఆమె లుక్ ని బయటపెట్టలేదు. అసలు స్వీటీ ఏ పాత్రలో కనిపించబోతుందనే హింట్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ లో ఆమె పేరు వాడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే సైరాలో స్వీటీ నటించలేదు అన్నట్టుగా వ్యవహరించారు. అలా ఎందుకు చేశారు ? అనేదానికి సినిమా చూస్తే సమాధానం దొరుకుతోంది.

సైరాలో అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో కనిపించారు. ఆమె ఆంగ్లేయులు దాటి చేస్తే వారిని తిప్పికొట్టిన సందర్భంలో.. తొలి స్వాతంత్య్ర పోరాటం చేసింది మనమే అని ఆమె సైనికులు చెబితే.. కాదు మనకంటే ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వీరుడు ఆంగ్లేయులపై పోరాడాని చెప్పడంతో సైరా కథ మొదలవుతోంది. ఇక థియేటర్ నుంచి అనుష్క లుక్ బయటికొచ్చింది. ఇందులో అనుష్క వీరవనితగా ఠీవిగా కనిపిస్తున్నారు. వీరత్వం, ధీరత్వం చూపడంలో ఆమెకి ఆమె సాటి. సైరాలో స్వీటీ లుక్ ని మీరు చూడండీ..!