బన్నీకి బామ్మరిది నోరు తెరిచాడు !


యంగ్ హీరో సుశాంత్ స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి బామ్మరిది అవుతాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్-బన్నీ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కోసం సుశాంత్ ని తీసుకొన్నారు. ఆయన బన్నీకి బ్రదర్ గా కనిపించబోతున్నాడని కొందరు. కాదు పూజా హెగ్డేకి సోదరుడుగా, బన్నీకి బామ్మర్థిగా కనిపిస్తాడని మరికొందరు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ స్పందించారు. తాను బన్నీకి బ్రదర్ ని కాదు. బామ్మరిదినీ కాదని క్లారిటీ ఇచ్చారు. మరేం అవుతారు ? అంటే.. అది తెలియాంటే కొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందేనన్నారు సుశాంత్.

ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నవదీప్ కూడా నటిస్తున్నారు. ఆయనది సినిమాలో విలన్ పాత్ర అని మొదట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే నవదీప్ సిక్స్ ప్యాక్ చేయడం చూశాం. ఐతే, ‘సామజవరగమన’ సాంగ్ లో నవదీప్ కనిపించాడు. ఆయనలో విలన్ ఛాయలు కనిపించలేదు. సాఫ్ వేర్ ఇంజనీర్ గా బన్నీ కొలిగ్ కా అనిపించారు. ఈ సాంగ్ లో నవదీప్ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన బన్నీ బ్రదర్, బామ్మరిది అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు.. ఆ రెండు కావని స్పష్టమైంది. 

ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది.