మెహ్రీన్ చక చకా మాట్లాడేసిందిగా.. !


టాలీవుడ్ లో రాణిస్తున్న యంగ్ హీరోయిన్స్ లో మెహ్రీన్ ఒకరు. ఎంట్రీతోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్లాపులని చవి చూసింది. తిరిగి పుంజుకొని ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొంది. యాక్షన్ హీరో గోపీచంద్ కి జంటగా ఆమె నటించిన చిత్రం చాణక్య. రేపు (అక్టోబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రమోషన్ వీడియోని రిలీజ్ చేసింది మెహ్రీన్. “అందరికీ నమస్కారం. నేను మెహ్రీన్. నా ఫిల్మ్ చాణక్య రేపు రిలీజ్ అవుతుంది. సో.. ప్లీజ్ తప్పకుండా సినిమా చూడండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూడండీ. సినిమాని ఎంజాయ్ చేయండీ” అంటూ తెలుగులో చక చకా మాట్లాడేసింది.

తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో చాణక్య తెరకెక్కింది. ఇదో స్పై థ్రిల్లర్. ఇది సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్’ కి రిమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ, అందులో నిజం లేదని దర్శకుడు తిరు క్లారిటీ ఇచ్చారు. ఇదో కొత్త కథ. కథనం బాగుంటుంది. యాక్షన్ ప్రియులకి ఇంకా బాగా నచ్చుతుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా కోసం రిస్కీ  యాక్షన్ సీన్స్ చేశారు గోపీచంద్. షూటింగ్ ఆఖరి రోజు ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గోపీచంద్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. అందుకు తగ్గటట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఆ ధైర్యంతోనే సైరాకి ఎదురు వెళ్తున్నారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 15 కోట్లకి అమ్ముడుపోయాయ్.