ప్రధానితో కేసీఆర్ భేటీ వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశం కావాల్సింది. ఇది కాస్త సాయంత్రం 4.30 గంటలకు వాయిదా పడింది. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రధానితో భేటీ కంటే ముందే కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మధాహ్నం 1:30గంటలకి సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది.
తెలంగా రాష్ట్రంలోని ఏదైన ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరనున్నారు. దీంతో పాటు గోదావరి నీళ్లు కృష్ణకు తరలించే ప్రాజెక్టుకు కేంద్రాన్ని నిధులు అడగనున్నారు. గత డిసెంబర్ 26న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని కలిశారు. దాదాపు 9 నెలల తర్వాత నేడు మరోసారి ప్రధానితో కేసీఆర్ భేటీ కానున్నారు.