లైవ్ : ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్
బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. రాకేశ్ వర్రె నిర్మాత. ఒకబ్బాయి, అమ్మాయి.. ఇద్దరి మధ్య ప్రేమ, అబ్బాయిని ఇష్టపడ్డ అమ్మాయి.. తన ప్రేమను మాత్రం అతనికి చెప్పదు. అబ్బాయి ఫోన్ చేసినా తిడుతుంది.. చేయకపోయినా తిడుతుంది. అయితే ప్రేమిస్తుంది. ఇద్దరి మధ్య ఉండే అంతరం కులం. మరి ఈ అంతరాన్ని దాటి ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యారా? లేదా? అనేది ఈ సినిమా కథ. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !