సైరా @100కోట్లు !


బాహుబలి, సాహో సినిమాల తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా సైరా. ఈ చిత్రానికి సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలితరం స్వాత్రంత్య్ర సరమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. చిరంజీవి టైటిల్ రోల్ లో నటించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన సైరా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది.

అందుకు తగ్గట్టుగానే వసూళ్లు ఉన్నాయి. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. దక్షిణాదిలో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదో సినిమాగా ఇది నిలిచిందని తెలిపారు. ‘బాహుబలి 2’ రూ.214 కోట్లు, ‘సాహో’ రూ.127 కోట్లు, ‘2.ఓ’ రూ.94 కోట్లు, ‘కబాలి’ రూ.88 కోట్లు వసూలు చేశాయని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.85 కోట్లతో ‘సైరా’ వాటి తర్వాత వరుసలో చేరిందన్నారు. ఈ లెక్కన సైరా తొలివారంలోనే పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చేలా కనిపిస్తోంది.