ఆ ఘాటుతనం పాయల్ కే సొంతం !


ఆర్ఎక్స్100 సినిమాలో బోల్డ్ నటనతో మెప్పించింది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమా కదా.. అవకాశం కోసం బోల్డ్ గా నటించి ఉంటుంది అనుకొన్నారంతా. కానీ, ‘ఆర్డీఎక్స్ లవ్’ సినిమా కోసం మరోసారి రెచ్చిపోయింది. ఘూటుగా నటించింది. దీనిపై పాయల్ ని అడిగితే.. “ఆర్ఎక్స్100, ఆర్డీఎక్స్ లవ్ చిత్రాల్లో ఉన్నంత బోల్డ్ పాత్రలు నేను తప్ప మరెవ్వరూ చేయలేరన్నది నా అభిప్రాయం. అయితే ఆ ఘాటుతనం అనేది స్క్రిప్ట్ లో ఉందేమో తప్ఫ.. నాలో కాదు. కథలో పాత్రకు తగ్గట్లుగా నేను కనిపిస్తుంటా అంతే. మీరు నమ్ముతారో లేదో.. ఇప్పటికీ నేను ఏదైనా స్క్రిప్ట్ వింటే అందులోని విషయాలన్నీ మా అమ్మతో పంచుకుంటా. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి, ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని చెబుతుంటా”నని చెప్పింది.

పాయల్ గురించి అందరికీ తెలియని విషయం ఏటంటే ? ఆమె బాలనటి. పలు పంజాబీ సీరియల్స్ లో నటించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొంది. ఆర్ఎక్స్100 కంటే ముందు పలు యాడ్స్ లో నటించింది. దాదాపు ఆరేళ్ల పాటు సినిమా అవకాశాల కోసం తిరిగింది. చివరికి ‘ఆర్ఎక్స్100’ సినిమా ఛాన్స్ కొరికింది. ఈ సినిమాతో వచ్చిన డబ్బుతో ముంబైలో ఓ ఇళ్లుకొనుకొంది. ఆ ఇంటిమీద ఆర్ ఎక్స్ 100 బొమ్మని కూడా గుర్తుగా ఏర్పాటు చేసుకుందట. ఆమె నటించిన ఆర్డీ ఎక్స్ లవ్ రిలీజ్ కి  రెడీగా ఉంది. ప్రస్తుతం పాయల్ వెంకీమామ, డిస్కో రాజా సినిమాల్లో నటిస్తోంది.