పెటా కోసం నగ్నంగా సన్నీ

పోర్ట్ స్టార్ సన్నీలియోన్ కాస్త బాలీవుడ్ హాట్ బ్యూటీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సన్నీ హాట్ హాట్ స్టెప్పులకు బాలీవుడ్ జనాలు ఫిదా అయిపోతున్నారు. ఐతే, చాన్నాళ్ల తర్వాత సన్నీ మళ్లీ మొత్తం చూపించేసింది. పెటా త‌ర‌పున ప్ర‌చారం కోసం భ‌ర్త డానియేల్ వెబ‌ర్‌తో క‌లిసి న‌గ్నంగా కనిపించింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటో షూట్ ద్వారా జంతువులను చంపి వాటి తోలు తీసి తయారు చేసిన దుస్తులను ధరించరాదు అనే సందేశాన్ని ఇస్తోంది. ఆమె ఇచ్చే సందేశం ఏమో గానీ, చాన్నాళ్ల తర్వాత సన్నీని నగ్నంగా చూసుకొని ముర్సిపోతున్నారు ఆమె అభిమానులు. ఇదిలావుండగా.. మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది సన్నీ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది.