ఇళయరాజా స్టూడియోని ఆక్రమించాలని చూస్తున్నారు
లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా పోలీసులని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకి గిఫ్ట్ గా వచ్చిన స్టూడియోని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు. చెన్నై ప్రసాద్స్ స్టూడియోస్ లోని ఓ రికార్డింగ్ స్టూడియోలో ఇళయరాజా గత కొన్నేళ్లుగా అనేక గీతాలు కంపోజ్ చేశారు. సదరు స్టూడియోను ప్రసాద్ స్టూడియోస్ సంస్థ స్థాపకుడు ఎల్వీ ప్రసాద్ ఇళయరాజాకు బహుమతిగా ఇచ్చారట.
ఇప్పుడా స్టూడియోని ఎల్వీ ప్రసాద్ మనవడు ఇన్నేళ్ల తర్వాత ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా కేసు పెట్టారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టూడియో పరిసరాల్లో పని చేసుకోనివ్వకుండా సిబ్బంది ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టూడియోలో ఉంచిన సంగీత వాయిద్యాలను దెబ్బతీశారని ఆరోపించారు. బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే స్టూడియోలో ఇళయరాజా చేసే కార్యక్రమాలకు అడ్డు వస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.