చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ !
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.తాడేపల్లిగూడెంలోని ఎస్వీఆర్ సర్కిల్ కె.య న్. రోడ్ లో 9.3 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు.
కృష్ణాజిల్లా నూజివీడులో ఎస్వీఆర్ జన్మించారు. మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన ‘వరూధిని’ చిత్రంతో నటుడిగా మారారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300ల చిత్రాలకు పైగా నటించారు.
#SVR #Megastar pic.twitter.com/e8hV9X1rAD
— SKN (@SKNonline) October 6, 2019