వివాహబంధంపై మహేష్ కామెంట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఫ్యామిలీతో అధిక సమయం గడుపుతుంటారు. సినిమా షూటింగ్ లేకపోతే.. ఇంట్లోనే ఉంటారు. ఫ్యామిలీతో కలిసి సడెన్ గా ఫ్యామిలీ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. వివాహబంధం సాఫీగా సాగాలంటే ఆలుమగలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలని మహేశ్ బాబు అన్నారు.
వోగ్ ఇండియా మ్యాగజైన్ కు మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మహేష్ వివాహబంధం గురించి మాట్లాడారు. “మా పెళ్లి జరిగి 14 ఏళ్లు అయ్యింది. మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. వివాహబంధం బలపడాలంటే ఒకే ఒక్క రహస్యం.. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం. ఇంతటి గొప్ప విషయాన్ని నాకు నేర్పించింది మా నాన్న. ఇంటికి రాగానే ఆయన ఓ పెద్దహీరో అనే విషయాన్ని మర్చిపోతారు. మాతో చాలా సంతోషంగా గడిపేవారు. ఇప్పుడు తానే అదే ఫాలో అవుతున్నా” అన్నారు.
వంశీ సినిమాలో మహేశ్-నమ్రత కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఐదు సంవత్సరాల ప్రేమ తర్వాత వివాహబంధంతో వీరు ఒక్కటయ్యారు. వీరికి గౌతమ్, సితార జన్మించారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఇక మహేష్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.