సందీప్ కిషన్ ‘A1ఎక్స్ ప్రెస్’ !


యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో ఒకే ఒక్క చెప్పుకోదగ్గ సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’. దాంతో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఆయనకి సెంటిమెంట్ గా మారింది. ఆయన నిర్మాణ సంస్థ పేరు వెంకటాద్రి టాకిస్ పెట్టుకొన్నారు. ఆయన తాజా చిత్రం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు  #DennisJeevanKanukolanu దర్శకత్వం వహించనున్నారు. సందీప్ కిషన్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని వదిలారు.

హాకి నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా ఇది. దానికి తగ్గట్టుగానే ప్రీ లుక్ లో సందీప్ కిషన్ హాట్ ట్రిక్ పట్టుకొని ఉన్నారు. ఆయన జెర్సీ వెనకాల ఎ1 ఎక్స్ ప్రెస్ అనే టైటిల్ ని రాసి ఉంది. ఈ చిత్రానికి హిప్ అప్ తమిజా సంగీతం అందించనున్నారు.