మీకు మాత్రమే చెప్తా : ‘అబద్ధం.. ‘ సాంగ్ అదిరింది ! 


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. ‘ఎవ్రీ ఫోన్‌ హ్యాజ్‌ ఇట్స్‌ సీక్రెట్స్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. తరుణ్‌ భాస్కర్, అభినవ్‌ గోమటం ప్రధాన పాత్రల్లో నటించారు. కొత్త దర్శకుడు షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అబద్ధం.. ‘ సాంగ్ ని విడుదల చేశారు.

అసుర రాసిన ఈ పాటని చందన రాజా పాడారు. ఓల్డ్ సాంగ్స్ స్టయిల్ లో సాగినా.. ఈ పాట వైవిధ్యంగా ఉంది. ఇటీవల కాలంలో ఇలాంటి భిన్నమైన పాట రాలేదని చెప్పవచ్చు. ఆ అబద్దం సాంగ్ ని మీరు ఓ సారి వినేయండీ.. !