నిర్మాతల వివాదంలోకి సీఎం.. అసలేం జరుగుతోంది ?


టాలీవుడ్ నిర్మాతలు బండ్ల గణేష్, పీవీపీల వివాదంలోకి ఏపీ సీఎం జగన్ ని లాగడం హాట్ టాపిక్ గా మారింది. పీవీపీ-బండ్ల గణేష్ ల మధ్య ‘టెంపర్’ సినిమాకి సంబంధించిన లావాదేవీల విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల రాత్రి సమయంలో బండ్ల తన అనుచరులతో పీవీపీ ఇంటికెళ్లి బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పీవీపీ పోలీసులకి ఫిర్యాదు చేయడం.. ఈ కేసులో బండ్లతో పాటు మరో నలుగురిపై  448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బండ్ల పరారీలో ఉన్నారు.

బండ్ల బయట కనిపించడం లేదు. కానీ, వినిపిస్తున్నాడు. ఆయన వాయిస్ ని ట్విట్టర్ వేదికగా గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ ని వాడుకోవడం ఆకట్టుకుంటోంది. పరోక్షంగా పీవీపీ దుర్మార్గాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు బండ్ల. ఇందుకోసం వరుస ట్విట్స్ చేస్తున్నారు. ఆదివారం పివిపి ని ఉద్డేశించి వరుస ట్విట్ చేసిన బండ్ల వాటిని సీఎం జగన్, వైసీపీ పార్టీకి ట్యాగ్ చేశారు. వైసీపీ తులసి మొక్కలో పివిపి గంజాయి మొక్క. ఆయన్ని కట్టడి చేయండని సీఎం జగన్ ని వేడుకొన్నారు బండ్ల. ఇక ఇవాళ కూడా బండ్ల వరుస ట్విట్స్ తో విరుచుకుపడుతున్నారు.

‘నా టెంపర్ చిత్రం ఆడియో ఫంక్షన్ లో ఇస్కాన్ రాజా నేను కష్టాల్లో ఉన్నాను నాకు ఇమేజ్ కొంచెం పెంచు నా గురించి కొంచెం బాగా మాట్లాడు ప్లీజ్ అని నా కాళ్లు పట్టుకొని బతిమాలితే నేను ఈ విధంగా మాట్లాడాను. ఇస్కాన్ రాజా గురించి ఈ మాటల మాట్లాడేందుకు చింతిస్తున్నాను బాధపడుతున్నాను’

‘స్కాం రాజా నా అప్పులు తప్పులు అన్ని కలిసి నువ్ ఒక్క రోజు బొంబాయి లో జల్సా అంత లేదు నా బ్రతుకు, ని స్కాంలు దేశ విధేశాలు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందయి, ఎన్నో స్కాములకు నువ్వు మూలం, ని దొంగ సంతకాల స్కాంలతో ఎందరో జీవితాలు బ్రష్టు పట్టించావు, ఎంతోమందిని మోసం చేసావ్

‘ఇప్పటికైనా మానుకొని నీతిగా నిజాయితీ గా బ్రతుకు, కస్టపడి బ్రతుకు, ఒక్కటి గుర్తుపెట్టుకో ముప్పై సంవత్సరాలనుండి ఇక్కడే ఉన్న, ఇంకో  ముప్పై సంవత్సరాలు ఇక్కడే ఉంటా ఈ ఇండస్ట్రీ లోనే చచ్చిపోత, నీలాగా వెయ్యి ఎవ్వరాలు వెయ్యి స్కాం లు ఉండవు’

‘స్కాం రాజా నా అప్పులు తప్పులు అన్ని కలిసి నువ్ ఒక్క రోజు బొంబాయి లో జల్సా అంత లేదు నా బ్రతుకు, ని స్కాంలు దేశ విధేశాలు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందయి, ఎన్నో స్కాములకు నువ్వు మూలం, ని దొంగ సంతకాల స్కాంలతో ఎందరో జీవితాలు బ్రష్టు పట్టించావు, ఎంతోమందిని మోసం చేసావ్’

‘నీలాగా నాకు రోజుకొక పార్టీ గంటకోక మనిషి, ఒకొక్కడిని ఒకోరోజు  తిడతావ్ ఒకోరోజు పొగుడుతవ్, ఒకరోజు భుజనా వేసుకువెళ్తావ్, వాళ్ళు నన్ను మోసం చేసారు అంటావ్, మళ్ళీ రెండో రోజు వాళ్ళదగ్గరకె టికెట్ తెచ్చుకుంటావ్, అయినా జనం అందరూ చీదరించిన చిత్కరిoచిన అక్కడే ఎలాడుతు ఉంటావ్’

‘నేను అట్లా చెయ్యను, జీవితం లో నమ్మేది ఒక్కడినే, నమ్మిన వాడినే చచ్చే వరకు ప్రేమిస్తూ ఉంట, కృతజ్ఞత అంటే నీకు తెలియదు లే, అధి ని బ్లడ్ లో లేదు’

‘కృతజ్ఞత అంటే కష్టం బై బర్త్ రావాలి బ్లడ్ లో ఉండాలి, ఆది నా బ్లడ్ లో పుష్కలంగ ఉంది, నువ్వు  కష్టం, నువ్వు  ఎక్కడ స్కాం ఉంటె అక్కడ వేలుస్థావ్, ఆ భగవంతుడు నీకు రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించి చాలా తప్పు చేసాడు’

‘నీ  స్కాంలతో దయచేసి పార్టీ ని ప్రజలను బ్రష్టు పట్టించి ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకు, దయచేసి మానెయ్ రాజకీయలు, తెలుసు నాకు నువ్వు ఇండియా లో ఉండవ్ గోవా లో ఒక ఇల్లు లండన్ లో ఇంకో ఇల్లు కట్టుకుంటున్నావ్ ఎందుకంటే ఈ స్కాం ల నుంచి తప్పించుకొని పారిపోవాలని ప్లాన్ చేస్తున్నావ్’

మొత్తానికి.. పివిపి బారీ నుంచి తనని కాపాడేగలిగే వ్యక్తి ఒక్కరే. అది ఏపీ సీఎం వైఎస్ జగన్ అని బండ్ల గణేష్ గట్టిగా భావిస్తున్నట్టు ఆయన చేస్తున్న వరుస ట్విట్స్ చూస్తే అర్థమవుతోంది. బహుశా.. ఈ ఆపద సమయాన బండ్ల.. తన దేవుడు పవన్ కల్యాణ్ ని మరచిపోయినట్టు కనిపిస్తోంది. పవన్ పట్టుకొంటే.. ఇంకాస్త ఈజీగా పనైపోవునేమోనని..తోటి పవన్ అభిమానులు అనుకొంటున్నరు..మరీ !