ప్రతిపక్షాలని ఇరుకున పెట్టిన ఆర్టీసీ సమ్మె !


వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ ఒత్తిడి కచ్చితంగా ప్రభుత్వంపైనే పడాలి. కానీ, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ప్రతిపక్షాలు ఇరుకున పడే పరిస్థితి నెలకొంది. అదెలా అంటారా ? ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగడం తప్పుకాదు. కానీ దసరా పండగ సీజన్ చూసుకొని మరీ.. సమ్మెకి దిగడటంతో వారికి ప్రజల మద్దతు లభించడం లేదు. ప్రజా మద్దతు లభించన ఏ ఉద్యమం సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఈ లెక్కన ఆర్టీసీ కార్మికుల సమ్మె అట్టర్ ప్లాప్ అని చెప్పవచ్చు.

సీఎం కేసీఆర్ చెప్పినట్టు సగటు ఆర్టీసీ కార్మికుడి నెల జీవితం రూ. 50,000. ఇక ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, భాజాపా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. అలాంటప్పుడు తెలంగాణలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ఎలా అడగగలుగుతారు? ఈ విషయాన్ని ప్రజలకి అర్థం అయ్యేలా చేయడం సీఎం సక్సెస్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులపైనే విమర్శలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి ఒకరోజు గడిచాక కానీ కాంగ్రెస్ వారికి మద్దతు ఇస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ప్రభుత్వం కన్నా.. ప్రతిపక్షాలనే ఇరుకున పెట్టేలా ఉందని చెప్పవచ్చు.